Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ఇలా.. పంట పొలాలకు పోయేది ఎలా

Follow Udayam on Google
madhu Aug 29, 2026 7:22 PM ములుగు General
రోడ్డు ఇలా.. పంట పొలాలకు పోయేది ఎలా - Udayam
కన్నాయిగూడెం మండలం ఏటూరులో పంట పొలాలకు వెళ్లే రహదారి పరిస్థితి దుర్భరంగా ఉంది. గ్రామస్థులు ప్రతినిత్యం ఈ రహదారి గుండా వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్తూ ఉంటారు. చినుకు పడితే నడవలేని పరిస్థితిలో రహదారి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, యంత్రాలు, కూలీలను పంట పొలాల వద్దకు తరలించాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని, అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...