Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పందలపాకలో దారి దోపిడీ

Follow Udayam on Google
జయ Aug 19, 2026 2:41 PM తూర్పుగోదావరి General
పందలపాకలో దారి దోపిడీ - Udayam
బిక్కవోలు మండలం పందలపాకలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడ్డారు. శుభకార్యానికి వెళ్లి దారితప్పిన కాజులూరు మండలం గొల్లపాలేనికి చెందిన సుబ్రహ్మణ్యం, వీరబాబులను బైక్‌పై వచ్చిన ఇద్దరు అడ్డుకుని బెదిరించారు. ఫోన్‌పే ద్వారా మద్యం దుకాణానికి డబ్బులు వేయించుకుని, అనంతరం రూ.500 నగదు, సెల్‌ఫోన్‌ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...