వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం పట్టణంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పలు రహదారులు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచి రోడ్లు చెరువులను తలపించాయి.
శ్రీకంఠం కూడలి నుంచి సూర్యానగర్ వంతెన మార్గంలోని దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

