Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జీలపై బాధ్యతగా స్పందించాలి

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:34 PM విజయనగరంGeneral
అర్జీలపై బాధ్యతగా స్పందించాలి - Udayam
ప్రజల నుంచి పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన ప్రతి అర్జీని బాధ్యతగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తమ శాఖకు సంబంధంలేని దరఖాస్తులను తిరస్కరించకుండా సంబంధిత శాఖకు పంపాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అంశాల అర్జీలను నిబంధనల మేరకు పరిష్కరించాలని, ఏ సమస్యా గడువు దాటి పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...