వార్తలకు తిరిగి వెళ్లండి

కథలాపూర్ తహసీల్దార్ రమేష్ ప్రయాణిస్తున్న కారు పోసానిపేట శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్వయంగా కారు నడుపుకుంటూ వస్తుండగా మూలమలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదకరమైన ఈ మలుపు వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

