వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా చెట్లు నరికిన భుక్య రాములుపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. సిరికొండ రేంజ్ అధికారి కే. నరసింగరావు ఆదేశాల మేరకు రావుట్ల సెక్షన్, రామచంద్రపల్లి బీట్‌లో తనిఖీలు నిర్వహించగా చెట్లు నరికినట్లు గుర్తించారు.
అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అటవీ సంపదకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

