Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో హై టెన్షన్ వాతావరణం

Follow Udayam on Google
Ch. Anji Oct 01, 2026 6:57 PM వికారాబాద్General
దోమ మండలం మోత్కూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 546, 547, 548 లలో గల భూములకు సంబంధించి భాగస్వామ్య పంపకాలు ఇంకా పూర్తి కాకముందే, దయాదులు ఆ భూములను రియల్టర్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మోత్కూర్ గ్రామానికి చెందిన బాధిత రైతులు ఆరోపించారు. న్యాయం జరగడం లేదనే ఆవేదనతో బాధిత రైతులు తమ వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Comments

G
Loading comments...