Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 8:52 PM విజయనగరంGeneral
రహదారి భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన - Udayam
విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్‌.దామోదర్‌ ఆదేశాలతో గురువారం భోగాపురం సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు , ఎస్ఐ సన్యాసినాయుడు డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం మత్తులో ఆటోలు నడపకూడదని సూచించారు. పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు. అలాగే అనుమాన్పద వస్తువులు రవాణా చేయకూడదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...