వార్తలకు తిరిగి వెళ్లండి
ఇస్రోలో రాజీనామాల కలకలం

ఇస్రోలో వంద మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం కలకలం రేపింది. గగన్‌యాన్ వంటి అత్యంత కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేధోవలసను అడ్డుకునేందుకు అంతరిక్ష శాఖ రంగంలోకి దిగింది.
జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు శాస్త్రవేత్తల రాజీనామాలను, స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులను ఆమోదించవద్దని ఇస్రో కేంద్రాలకు అంతరిక్ష శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...