Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైలెన్సర్లు తీసేసి హంగామా.. 16 బైక్‌లు సీజ్‌

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 10, 2026 3:55 PM కోనసీమGeneral
సైలెన్సర్లు తీసేసి హంగామా.. 16 బైక్‌లు సీజ్‌ - Udayam
హీరో పుట్టినరోజు వేడుకల పేరుతో బైక్‌ల సైలెన్సర్లు తొలగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న 16 బైక్‌లను అమలాపురంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం డీఎస్పీ ప్రసాద్ ఆదేశాలతో టౌన్ సీఐ వీరబాబు, ట్రాఫిక్ ఎస్‌ఐ యేసుబాబు బృందం దాడులు నిర్వహించారు. విపరీతమైన శబ్దాలతో రోడ్లపై హంగామా సృష్టించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...