Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టంలో ఆక్రమణల తొలగింపుపై నిరసన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 06, 2026 9:15 PM పార్వతీపురం మన్యంGeneral
వీరఘట్టంలో ఆక్రమణల తొలగింపుపై నిరసన - Udayam
వీరఘట్టం కోనేరు వద్ద ఆక్రమణల తొలగింపులో పేదల గుడిసెలను మాత్రమే తొలగిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు గురువారం పార్కు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. చెరువు చుట్టూ ఉన్న అన్ని ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. రూ.50 లక్షలతో పార్కు నిర్మాణం చేపట్టగా, కోనేరు పరిసరాల్లో సుమారు 3 ఎకరాల ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.పేదల గుడిసెలతో పాటు పెద్దోళ్లు కట్టిన భవనాలనూ తొలగించాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...