Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామమందిరంలో మతపరమైన కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 23, 2026 10:19 AM జాతీయంGeneral
అయోధ్య రామమందిరంలో మతపరమైన కమిటీ ఏర్పాటు - Udayam
రామ మందిరంలో విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం సమావేశమైంది. ఆలయ పూజలు, ఆచారాలు, వార్షిక కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు స్థానిక నిపుణులతో మతపరమైన కమిటీని నియమించింది. అలాగే, ఆలయానికి కొత్త సీఈవోను ఎంపిక చేసే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించింది. సెప్టెంబర్ 2 లోగా ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ట్రస్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...