వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఇకపై ప్రతి నెలా భోజన, కాస్మెటిక్ రుసుములు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెరిగిన ధరల ప్రకారం భోజన ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు ఆయన ప్రకటించారు.
అలాగే రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, వంద యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. హాస్టళ్ల పునర్నిర్మాణంలో భాగంగా నింబోలిఅడ్డాలో నూతన ఎస్సీ హాస్టల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

