వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు DRO విజయకుమార్ తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన జిల్లావాసుల పేర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించడంతో పాటు వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

