వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టి సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని సీపీఐ అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
మార్కెట్‌లో అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలను అరికట్టాలని కోరారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

