Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేజ మిరపకు రికార్డు ధర

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 31, 2026 10:48 AM ఖమ్మంGeneral
తేజ మిరపకు రికార్డు ధర - Udayam
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం ఏసీ మిరప క్వింటా గరిష్ఠ ధర గురువారం రూ.23,050కు చేరింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధరగా నమోదైంది. మార్కెట్‌కు సుమారు 13 వేల బస్తాల మిరప సరకు వచ్చింది. నాన్‌ ఏసీ మిరప క్వింటా గరిష్ఠ ధర రూ.17,400 నమోదైంది. నిల్వల్లోని మిరపను రైతులు విక్రయిస్తుండగా, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...