Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయినపల్లి కాల్వకు గండి.. రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 2:59 PM మెదక్General
రాయినపల్లి కాల్వకు గండి.. రైతుల్లో ఆందోళన - Udayam
మెదక్‌ మండలం రాయినపల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్‌ భారీ వర్షాలకు దెబ్బతినడంతో ఏడు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెరువు కట్ట కూడా దెబ్బతినడంతో మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి పరిశీలించారు. తాత్కాలిక మరమ్మతుల వల్లే పరిస్థితి తలెత్తిందని ఆమె ఆరోపించారు. కెనాల్‌ ద్వారా 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, అధికారులు వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...