Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌కు ఈకేవైసీ తప్పదు

Follow Udayam on Google
రవళి దేవి Jul 30, 2026 9:37 AM హైదరాబాద్General
రేషన్‌కు ఈకేవైసీ తప్పదు - Udayam
రేషన్‌ కార్డులో పేరున్న ఐదేళ్లకు పైబడిన ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. వేలిముద్రలు నమోదు చేయకపోతే రేషన్‌ పంపిణీ నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బోగస్‌ కార్డుల ఏరివేత, పారదర్శకత కోసం ఈ ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో 9.88 లక్షల మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 71.64 శాతం మంది ఈకేవైసీ పూర్తి చేశారు. ఇంకా 2.80 లక్షల మంది పెండింగ్‌లో ఉన్నారు.

Comments

G
Loading comments...