Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్టగుట్ట ఆలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Aug 28, 2026 6:17 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మెట్టగుట్ట ఆలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు - Udayam
గంపలగూడెం మండలం పెనుగొలను మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి మూలవిరాట్‌ను పూలతో విశేషంగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో ముస్తాబు చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...