వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీరు మండలం రాజురా శివారులో రూ.1.60 కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. బండరాళ్లు పూర్తిగా పేర్చకపోవడంతో వరదలకు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటి నిల్వ కోసం అడుగు భాగంలో మట్టి తొలగించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు పూర్తి చేస్తామని ఇంజినీర్ తెలిపారు.
Comments
Loading comments...

