వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూరు మండలం మున్నూరుసోమారంలో ఆన్‌లైన్‌లో డీఏపీ బుక్ చేసుకున్న మహిపాల్ అనే రైతుకు ఎరువు ఇవ్వకుండా దుకాణ యజమాని బెదిరింపులకు దిగాడు. ‘స్టాక్ లేదు.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకో, ఎవరికైనా చెప్పుకో’ అంటూ దబాయించాడు.
ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారుల దృష్టికి సమస్య వెళ్లినా స్పందన కరువైంది.
Comments
Loading comments...

