Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 18, 2026 4:11 PM మంచిర్యాలGeneral
రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించాలి - Udayam
రైతులు కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలని జన్నారం క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. జాతీయ ప్రకృతి వ్యవసాయం మిషన్ లో భాగంగా శుక్రవారం జన్నారం క్లస్టర్ పరిధిలోని రైతులకు రసాయనాలను ఉపయోగించకుండా కూరగాయలు సాగు చేయడంపై అవగాహన కల్పించారు. కూరగాయల సాగుతో రైతులకు మేలు జరగడంతో పాటు మంచి ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కృషి సఖిలు జక్కుల రజిత, అంజలి, రైతులు అయ్యారు చంద్రమౌళి, నర్సయ్య, రాయమల్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...