Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ మసీదులో ఆత్మాహుతి పేలుడు.. 16 మంది మృతి

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 5:10 PM అంతర్జాతీయంGeneral
పాక్‌ మసీదులో ఆత్మాహుతి పేలుడు.. 16 మంది మృతి - Udayam
పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌ కొహాట్‌ జిల్లాలో శుక్రవారం నమాజ్‌ సమయంలో మసీదు సమీపంలో ఆత్మాహుతి పేలుడు జరిగింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు ఓల్డ్‌ పోలీస్‌ లైన్స్‌ సమీపంలో చోటుచేసుకుంది. పేలుడు ధాటికి మసీదు, సమీప భవనాలు దెబ్బతిన్నాయి.

Comments

G
Loading comments...