Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టపగలే వేట కొడవలితో దాడి

Follow Udayam on Google
sanjay Sep 18, 2026 5:49 PM జాతీయంGeneral
పట్టపగలే వేట కొడవలితో దాడి - Udayam
వనస్థలిపురం ఎన్జీవోస్‌ కాలనీ బస్టాండ్‌ సమీపంలో పట్టపగలు ఓ వ్యక్తిపై వేట కొడవలితో దాడి జరిగింది. పాల వ్యాపారి భుజంగరావు (60)పై సురేంద్రసింగ్‌ దాడి చేసినట్లు సమాచారం. గుర్రంగూడలోని ఓ ప్లాట్‌ వివాదమే దాడికి కారణంగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన భుజంగరావును కామినేని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం నిందితుడు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.

Comments

G
Loading comments...