వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మండలం మునగవలసలో బుధవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి వై.వి.ఎస్. మురళీకృష్ణ పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
పంటలకు ఎరువులను అవసరమైన మోతాదులో, సమతుల్యంగా వినియోగించాలని సూచించారు. చీడపీడలు, తెగుళ్ల లక్షణాలను తొలిదశలో గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
Comments
Loading comments...

