వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. అంకాపూర్‌లో గురువారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రైతులకు గిట్టుబాటు ధర, కూలీలకు నిరంతర ఉపాధి, కనీస వేతనాలు కల్పించాలని కోరారు. ఖమ్మంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

