Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 21, 2026 6:22 AM హైదరాబాద్General
నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు - Udayam
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం దీనికి కారణమని తెలిపింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో సిర్పూర్ (యు)లో అత్యధికంగా 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...