Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు పట్టాలపై మృతదేహం కలకలం

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 7:24 PM శ్రీకాకుళంGeneral
రైలు పట్టాలపై మృతదేహం కలకలం - Udayam
ఇచ్చాపురం–జాడుపూడి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పలాస రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ దుంపల శ్రీనివాసరావు తెలిపారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, నీలం రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడని చెప్పారు. అతని కుడిచేతిపై ‘JAYA DEB’ అనే పచ్చబొట్టు, మృతదేహానికి తల వెనుక భాగంలో గాయం ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన పలాస రైల్వే పోలీసులను సంప్రదించగలరు .

Comments

G
Loading comments...