వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ పట్టణం శివాజీ చౌరస్తా సమీపంలోని బైపాస్ రోడ్డు డివైడర్ వద్ద గుంతలను మున్సిపల్ అధికారులు పూడ్చారు. రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, రాత్రివేళ పలువురు ప్రమాదాలకు గురయ్యారు.
మున్సిపల్ ఛైర్మన్ రవి, కమిషనర్ మనోహర్ ఆదేశాలతో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వినయ్ మంగళవారం చర్యలు చేపట్టారు. పారిశుద్ధ్య సిబ్బందితో గుంతలను పూడ్చించారు.
Comments
Loading comments...

