Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్‌ స్కూళ్లలో కలెక్టర్‌ తనిఖీలు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:00 PM జగిత్యాలGeneral
రాయికల్‌ స్కూళ్లలో కలెక్టర్‌ తనిఖీలు - Udayam
రాయికల్ మండలంలోని మూడు పాఠశాలలను కలెక్టర్ బి.సత్యప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. జగన్నాథ్‌పూర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, ఒడ్డెలింగాపూర్ మినీ గురుకులం, ఉప్పుమడుగు కేజీబీవీలో విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధు, డీఈఓ కె.రాము, తహశీల్దార్, ఎంపీడీవో, ఆర్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...