వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం రావుట్ల రిజర్వ్ ఫారెస్ట్‌లోని కంపార్ట్మెంట్ నం.395లో చెట్ల నరికివేతపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు.
అటవీ భూమిని ఆక్రమించేందుకు మెట్టు తండాకు చెందిన జర్పుల లింభ్య చెట్లను నరికినట్లు తనిఖీల్లో గుర్తించామని సిరికొండ ఎఫ్‌ఆర్‌ఓ కే. నరసింగరావు తెలిపారు. అనుమతి లేకుండా చెట్ల నరికివేత, అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

