Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావాడలో తాగునీటి సరఫరాలో అంతరాయం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 5:51 PM శ్రీకాకుళంGeneral
రావాడలో తాగునీటి సరఫరాలో అంతరాయం - Udayam
​రణస్థలం మండలం రావాడలో పదిహేను రోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జలజీవన్ మిషన్ లో ట్యాంక్ ఏర్పాటు చేయకుండా మోటారు నుంచి నేరుగా పైప్ లైన్లకు నీరు వదలడంతో అన్ని ఇళ్లకు నీరు చేరడం లేదని వాపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, స్థానిక నాయకులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...