Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాథోడ్ బాపురావుకు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 14, 2026 7:05 PM ఆదిలాబాద్General
రాథోడ్ బాపురావుకు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు - Udayam
ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతానని బాపురావు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఆయన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...