వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట పిఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి గట్క పోటీలకు ఎంపికయినట్లు హెచ్ఎం రూపవతి సోమవారం తెలిపారు.
జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో వివిధ తరగతులకు చెందిన 14 మంది విద్యార్థిని విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. వచ్చే నెల 11, 12 తేదీలలో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వీరు హాజరుకానున్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.
Comments
Loading comments...

