వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండలం రామయ్యపల్లిలో బుధవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డా. సుస్మిత తెలిపారు. గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో సర్పంచ్ మూల మంగ విజ్ఞప్తి మేరకు క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పత్తిపాకలో TB స్క్రీనింగ్, ఎక్స్‌రే క్యాంపు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

