వార్తలకు తిరిగి వెళ్లండి

జె.పంగులూరు మండలం రామకూరులో కోతుల బెడదతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద కూర్చున్న షేక్ జాన్‌పై కోతి దాడి చేసి కరవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతణ్ని చికిత్స కోసం మార్టూరు ఆసుపత్రికి తరలించారు. కోతులు తరచూ మనుషులపై దాడి చేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించి రక్షణ కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

