వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం ప్రాంతంలో వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుందనపల్లి జీపీ రాజీవ్ స్వగృహలో రెండు ఇళ్లు, గోదావరిఖని బస్టాండ్ కాలనీలో కార్మికుడు గోలి శ్రీనివాస్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకెళ్లినట్లు సమాచారం. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఘటనలపై క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

