వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇందల్వాయి బస్టాండ్ మహిళలతో కిక్కిరిసిపోయింది. తోబుట్టువులకు రాఖీలు కట్టేందుకు వివిధ గ్రామాలకు వెళ్లే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు తోపులాటకు గురయ్యారు. రద్దీ నియంత్రణకు పోలీసులు, ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

