వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాకు చెందిన రాకేష్ గురూజీకి తమిళనాడులోని హోసూర్‌లో డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. గత 12 ఏళ్లుగా శ్రీ భవానీ శంకర్ మఠం ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక సేవలు, అన్నదానం అందిస్తున్న ఆయన సేవలను గుర్తించి 'ఆసియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్
అకాడమీ' ఈ పురస్కారం అందజేసింది. భవిష్యత్‌లోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని గురూజీ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

