వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరోలు మండలం రాజుపాలెం నుంచి పాయలపల్లె వరకు ఉన్న మెటల్ రోడ్డుకు పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.2.5 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.
దాదాపు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ పనులతో ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న పాయలపల్లె గ్రామస్థుల కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

