వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలి నుంచి సుంకేసుల డ్యామ్ మీదుగా కర్నూలుకు బస్సు సర్వీస్ సోమవారం పునఃప్రారంభమైంది. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో ఈ సర్వీసును ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ గంగిరెడ్డి, ఉపసర్పంచ్ సంధ్యారెడ్డి తెలిపారు.
రిబ్బన్ కట్ చేసి బస్సు సేవలను ప్రారంభించారు. ఈ సదుపాయం ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయోగకరమని పేర్కొంటూ ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

