వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాభిషేకం చేయగా, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
భక్తులు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లను తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అర్చకులు ఆకు పూజ చేయించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

