Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ విభేదాలతో దాడులు సరికాదు మాజీ మంత్రి

Follow Udayam on Google
K. Anuradha Sep 30, 2026 3:52 PM శ్రీకాకుళంGeneral
రాజకీయ విభేదాలతో దాడులు సరికాదు మాజీ మంత్రి - Udayam
పలాసలో ప్రముఖ వ్యాపారవేత్త తూముల శ్రీనివాసరావు ఇంటిపై రాత్రి జరిగిన దాడి యత్నాన్ని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఖండించారు. బుధవారం వైఎస్సార్సీపీ నాయకులు, వైశ్యకులం పెద్దలతో కలిసి శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు. రాజకీయ విభేదాలతో ఇళ్లపై దాడులకు యత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...