వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం రాజాపేటలో నగర సంకీర్తనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మార్కుక్ శ్రీ భావానంద స్వామివారి ఆశీస్సులతో, అదరాసుపల్లి శ్రీధర్ శర్మ పర్యవేక్షణలో, శాఖ అధ్యక్షుడు నంగునూరు రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
శ్రీ పి. రామకృష్ణ మందిరం ప్రధాన అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద శర్మ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయాలను సందర్శిస్తూ నగర సంకీర్తన చేశారు.
Comments
Loading comments...

