Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలంలో భారీ వర్షం

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 20, 2026 10:09 AM నంద్యాలGeneral
ప్యాపిలి మండలంలో భారీ వర్షం - Udayam
ప్యాపిలి పట్టణంతో పాటు గుడిపాడు, పోతుదొడ్డి తదితర గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఇదే పెద్ద వర్షం అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఎల్నీనో కారణంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు రైతులు సాగు చేసిన అన్ని రకాల పంటలు పూర్తిగా ఎండిపోయాయి. పంటలకు పెట్టిన పెట్టుబడి అంతా మట్టి పాలైందని రైతులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...