Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలక ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 7:19 AM అమరావతిGeneral
పురపాలక ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. తొలి విడతలో 13 కార్పొరేషన్లు, 87 పురపాలికల్లో ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 3,942 వార్డులకు 12,244 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. గ్రేటర్ విశాఖలో 120 వార్డులకు 1,990 కేంద్రాలను గుర్తించారు. మిగిలిన 23 పురపాలికల్లో రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...