Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులికాట్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని మత్స్యకారుల డిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:09 PM తిరుపతిGeneral
పులికాట్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని మత్స్యకారుల డిమాండ్ - Udayam
తడ మండలంలోని 24 కుప్పాల మత్స్యకారులు ఆంధ్ర–తమిళనాడు పులికాట్ సరస్సు సరిహద్దు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు మత్స్యకారులు ఆంధ్ర పరిధిలోకి వచ్చి చేపల వేట చేస్తూ తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి, ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించకపోతే 3 వేల మందితో ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...