Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ప్రయోజన పథకాలు కొనసాగిస్తాం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 5:13 PM సిద్దిపేటGeneral
ప్రజా ప్రయోజన పథకాలు కొనసాగిస్తాం - Udayam
ప్రజలకు మేలు చేసే పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తుందని సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పూజల హరికృష్ణ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌తో కలిసి మాట్లాడారు. ఉనికి కోసమే బీఆర్‌ఎస్‌ నాయకులు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాజీవ్‌ గృహకల్ప పథకం పేరును మార్చింది బీఆర్‌ఎస్‌ కాదా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...