Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండలాల్లో ప్రజావాణికి శ్రీకారం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 3:10 PM నారాయణపేటGeneral
మండలాల్లో ప్రజావాణికి శ్రీకారం - Udayam
సోమవారం నుంచి జిల్లాలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అన్ని మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. నారాయణపేట ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ ప్రియాంక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...