Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 5:10 PM గుంటూరుGeneral
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తి మృతి - Udayam
తెనాలి రైల్వే స్టేషన్‌ మూడవ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై శనివారం రైలు ఢీకొని సుమారు 50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్‌ఐ సరస్వతి తెలిపారు.

Comments

G
Loading comments...